అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/17/10

పాపం 'తార'కెన్ని కష్టాలు :P

బ్లాగులు చదివే వారిలో అసైన్సు కబుర్లు తార తెలీని వాళ్ళు ఉండరు. అయితే ఈ తారకి వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు. బ్లాగు లోకం లొ ఎవరూ ఎదుర్కోనన్ని నీలాపనిందలు ఎదుర్కొన్న మన తార .......యెంత మంది చవితి చంద్రులను దర్శించాడో గాని! ......... ప్రపీసస పుట్టిన కొత్తలో నేను అందులో తార అంటే అమ్మాయి అనుకుని మన నాగ ప్రసాద్ ని అడిగా "ఎవరా అమ్మాయి" అని ... 33 సార్లు gelakguling ఇలా పొర్లి పొర్లి నవ్విన నాగప్రసాద్ "అమ్మాయి కాదు అబ్బాయి"అని చెప్పాడు. కానీ అప్పటికే మెజారిటీ బ్లాగు లోకం తార ని అమ్మయిగానే గుర్తిస్తు వస్తుంది అప్పటి దాకా. అయితే ఇంగ్లీషు లొ స్టార్ అని ఉంటే అబ్బాయి అని తెలుగులో తార అని ఉంటే అమ్మాయి అనుకోవడం మన అవివేకం అనేది నా అభిప్రాయం.

ఇక ప్రజలు అప్పటికే అమ్మాయి అని అపార్ధం చేసుకున్న తార ని మొన్న ఒకాయన "బాబు యోగి అంటే నువ్వే కదా" అని అడిగాడట. దెబ్బకి దిమ్మ తిరిగిన తార ఆయనకి అసలు విషయం అర్ధం అయ్యేలా చెప్పి బయటికి వచ్చె సరికి విమల్ రెడీగా ఉన్నాడు . "హే తార బ్లాగు బాబ్జి నువ్వే కదా" అని టీనేజి పిల్లాడు విమల్ అమాయకంగా అడిగేసరికి మన తార గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. నేను బ్లాగు బాబ్జీ ని కాను మొర్రో అని మొత్తుకుని అక్కడి నుండి బయట పడ్డ తార నేరుగా బ్లాగు బాబ్జి దగ్గర ఈ విషయమై కామెంట్ పెడదామని వెళ్లాడు . అక్కడ తారని చూసిన బ్లాగు బాబ్జి .....................................
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

"అన్నాయి మార్తాండ అంటే నువ్వే కదా" అని అడిగేశాడు ihikhik. పాపం తార :P

19 comments:

ఆ.సౌమ్య said...

హిహిహి లాస్ట్ ది మీత్రం సూపరు. ఇప్పుడు నాకూ డౌటొస్తున్నాది తారేనేమో అని :P

banthi said...

taraa :( :( :(

Apparao Sastri said...

:)

Apparao Sastri said...
This comment has been removed by the author.
Anonymous said...

:))

Thiru said...

యేంటీ బ్లాగు బాబ్జి, తారా ఒకళ్ళు కాదా ???
:)

హరే కృష్ణ said...

papam tara :-(:-(
Idedo da.ko.bla.
sa kutra

వెంకట్ said...

హి హి నా బ్లాగు లో తార మొదటి కామెంటు చూసి నేను కూడా ఈవిడ నా కంటే వయసులో చాలా పెద్దావిడ లాగా ఉంది అనుకున్నా :)

Apparao Sastri said...

మంచు గారిని కూడా నేను మొదట్లో అమ్మాయి అనుకున్నా

Anonymous said...

Enjoy this cartoon on "Hero of Odarpu Yatra"..

Cinegoer

nagarjuna said...

లాస్ట్ లైను కోకో కేక..... :)) ROFL

కవిత said...

Paapam Taara...avunu avunu,,,idi kachithanga da.ko.bla.
sa kutra ane anipisthundi.

నేస్తం said...

చదువుకునే రోజుల్లో నాకో ఫ్రెండ్ ఉండేది పేరు సితార ...అన్నం తింటే చాలు ఎప్పుడు చూడు అన్నం అన్నం అని కుక్కలా అదే తింటావ్ అందులో ఏముంది గడ్డి..అని రోజూ హితబోధలే ...ఓ మారు జ్యోతిగారి బ్లాగ్లో తార గారి ఓట్స్ మీద క్లాస్ చూసి..వచ్చేసిందిరా బాబోయ్ అదే ఇది ..కంఫర్మ్ అనేసుకున్నా... ఇలా తార గారు నా అంచనాలు తారుమారు చేస్తారని అంకోలేదు :D

తార said...

బాబు మీరు నన్ను మొదట్లో నాగ అని అన్నారు మర్చిపోయారా?

ఇంకా నయ్యం, నీదీ గుంటూరే, కాగడాదీ గుంటూరే కావున నేనే కాగడా అనలేదు..

నేస్తంగారు, ఓహో అప్పటి మీ కామెంట్ కి అర్ధం ఇదా..
అంచనాలను తారుమారు చేయడం అంటే, మిరు వంటల మీద రాస్తాను అని అంచనా వేసితిరా?

[నవీన భారతదేశంలో నా పౌరోహిత్యం శర్మగారు, పిన్నమ్మా అని పిలిచారు బాసు..అదెవరికి చెప్పుకోను?]

Sravya Vattikuti said...

పాపం తార గారి కి నా ప్రగాడ సానుభూతి !

సుజాత said...

అబ్బ, సైన్సు రాసే ఆడవాళ్ళే లేరు, ఇన్నాళ్ళకొకళ్ళొచ్చారు అని నేనూ సంబర పడ్డా మొదట్లో! తర్వాత తెల్సింది.:-))

అయినా మార్తాండ స్టైల్ ఇంకోళ్ళకొస్తుందా, నువ్వేనా మార్తాండ అని అనుమానించేందుకు!

శ్రీనివాస్ పప్పు said...

హిహిహి ఇవ్వాళ కూడా నన్ను ఎవరో అడిగారు తార అంటే ఆడా మగా అని నాకు తెలీదు అని చెప్పాను వారితో,కానీ ఇప్పుడు కంఫర్మ్ చెయ్యాలి తార అంటే మగాడే అని.

Anonymous said...

Wow !! I was thinking Nagaprasad, Blog Babji and Tara are one and the same !!!

- Shiv.

tiru said...

కాగడాది గుంటూరా ?
ఐతే కాగడా ఎవరో తారకి తెలుసన్నమాట.