అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

4/21/10

దర్శకరత్నకు లేఖ - సూటిగా సుత్తి లేకుండా !

దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి ,

నమస్కరించకుండా వ్రాయునది ... బాబు సినిమా ఇండస్ట్రీ కి పెద్దన్న అని మీకు మీరు అనుకున్నారేమో తెలీదుగానీ మేము ఎవరం అనుకోలేదు. అయితే ఎంతో మందికి లైఫ్ ఇచ్చానని చెప్పుకున్న మీరు , అనేక హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించిన మీరు పూర్తిగా కొత్తవారితో ఒక సినిమా తీస్తున్నారట. దాని పేరు "యంగ్ ఇండియా" అట. నా ఖర్మ గాలి ఆ సినిమా పాటలు నిన్న రాగా.కాం లో విన్నాను . అంతా బాగానే ఉంది గాని ఆ" కోల్ కోల్ కలకత్తా" పాట అంత దరిద్రంగా , చండాలంగా , నీచంగా , నికృష్టంగా , రాసిన వాడిని , పాడిన వారిని పడేసి కొడదాం అనిపించేలా ఉంది . మరి మీకు అనిపించలేదా ? ఎన్నోహిట్ చిత్రాలకి దర్శకులు మీరు.. ఏదన్నా సినిమా ఫంక్షన్ కి వస్తే ప్రస్తుతం మారుతున్న సినిమా విలువల గురించి వల వాలా మాట్లాడేసి నవతరం దర్శకులను , నటులను ఎకి పీకి పారేసే మీకు ఇది తగునా? సక్సస్ కోసం పాటలో సభ్యత గల మనుషుల మనోభావాలు గాయపడేలా .... బండభూతులు చొప్పించి మరీ పాడించాలా ????? రాసిన సాహితి కి బుద్ధిలేదా లేక పాడిన మాలతికి జ్ఞానం లేదా లేక ఆ సినిమా నిర్మిస్తున్న మీకు అసలేమీ లేదా? మీకు లేఖ రాసే ఈ నా ప్రయత్నం .....ఏదో గొడవ చస్తే ఆ పాట తొలగిస్తారని కాదు ... మీ మైండ్ సెట్ మార్చుకుంటారని ...

వికటకవి

5 comments:

Raghav said...

I think that movie is yet to get censor certificate, hope they r gonna cut that song.

రవిచంద్ర said...

వామ్మో భరించలేని బండబూతులు...

Anonymous said...

meeru cheppaakaa pata vinnaanu nijjamgaa asayyam

Anonymous said...

ఆ లైన్లు సెన్సార్ దశలో తొలగిస్తారు. కానీ చాలా చండాలమైన ప్రయోగంతో తన సినిమా పేరు జనాల్లో బాగా తిరిగేలా చేశాడు దాసరి.

జిజ్ఞాసి said...

దాసరి ....యంగ్ ఇండియా ? పెద్ద జోక్!