అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/16/10

అవును నేను అబ్బాయిలకి ప్రతినిధిని

అబ్బాయిలందరికీ నువ్వు ప్రతినిధివా? అని జ్యోతిగారు వారి బ్లాగులో నన్ను చాలా ఆవేశంగా ప్రశ్నించారు. మరి మీరు మహిళా బ్లాగర్ల తరపు ప్రతినిధా?????? ఆ పోస్టు మీకు ఎవరు ఇచ్చారు ? ఎలా అయితే మీరు మహిళల తరపున మాట్లాడుతున్నారో , అలాగే నేను అబ్బాయిల తరపున మాట్లాడుతున్నాను. ఎస్ నేను అబ్బాయిలకి ప్రతినిధిని.

మీ పోస్ట్ లో నా మొదటి కామెంట్ మామూలుగానే పెట్టాను. మీ వివరణ బాగుంది అన్నాను . మీ పేరు వాడినందుకు ఖండిస్తాను అని కూడా అన్నాను. ఆ కిరణ్ కుమార్ ని చూశాక నాకు కోపం వచ్చింది . మీరు ఏకపక్షంగా శ్రీనివాస్ నీకెందుకు అంత కోపం అని అడిగితే ఎలా????? అతడు ఒకప్పుడు నన్ను తిట్టి ఉన్నాడు అందుకే కోపంగా అడిగా . నేనేదో మీ టపాకి కోప్పడుతున్నట్టు మీరు బిల్డప్ క్రియేట్ చేసుకుంటే నాకు వచ్చిన నష్టం లేదు . నేను బ్లాగుల్లోకి వచ్చిన కొత్తలో ...... మీ పోస్టులో 15 వ కామెంటు పెట్టిన కిరణ్ కుమార్ వచ్చి చెండాలంగా కామెంట్ చేసి పోయాడు . అసలు అపుడు నాకు ఏ గొడవల్లో సంబంధం లేదు . అయినా తిట్టాడు. అప్పుడు నేను భయస్తుడిని అవడం వల్ల ఆ కామెంట్ డిలీట్ చేశాను. ఇప్పుడు ఇదిగో మళ్లీ మీ బ్లాగ్ లో ప్రత్యక్షం అయ్యాడు. జ్యోతక్క గారు అని ఆప్యాయంగా మాట్లాడుతూ పెద్ద పత్తిత్తు లాగ కామెంట్ పెట్టాడు. మరి మీ తమ్ముళ్ళు
--తాను చేసే సంసారం ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం-- అనే టైపు లో మాట్లాడే వ్యక్తులా అబ్బాయిలని గురించి అవాకులు చెవాకులు పేలేది.

నన్ను ఒకడు ఒక బ్లాగులో "ఈడెమ్మ" అని తిట్టాడు ఈ మధ్యనే ... ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి అప్పుడు మీకు కోపం రాలేదు ??? ఏమండీ బ్లాగులు రాసే వారి తరపునే వకాల్తా పుచ్చుకుంటారా? అప్పుడు నేను సదరు వ్యక్తి ఐపి దొరికింది , పట్టుకున్నాను అతను పలానా ఊరు నుండి నన్ను అన్యాయంగా తిట్టాడు అని కూడా నా బ్లాగులో పోస్ట్ పెట్టాను ....ఒక్కడంటే ఒక్కడు కూడా మద్దతు పలక లేదు . కనీసం ఖండించనూ లేదు . ఏం ఆడాళ్ళని తిడితేనేఈ మగమహారాజులకి పొడుచుకుని వస్తుందా? ( అదేనండి కోపం)



గతం మరువకండి ... ఒక సారి నేను ఒకే ఒక టపా సరదాగా రాసి అందులో శరత్ అనే పేరు ఉచ్చరించినందుకు అజ్ఞాతలు నన్ను, నాకు మద్దతు పలికినందుకు నా స్నేహితురాలీని ఎంత నీచమైన మాటలు అన్నారు .. అపుడు ఎవడూ మాకు సపోర్ట్ రాలేదే. మేము అపుడు ఎవరి జోలికి వెళ్ళే వాళ్ళం కాదే. అప్పుడు ఈ జనాలు ఎవరూ నోరు మెదపలేదే?

ఆ కామెంట్లు సరిగా గుర్తు లేవు కానీ మహిళా బ్లాగర్లు పెట్టేవే కొని ఉదాహరణలు చూద్దాం :-

1) ఒంగోలు శ్రీనివాస్ తను సహాయ ఫౌండేషన్ ప్రతినిధి అని చెప్పుకుంటాడు. కానీ చేసేవే దగుల్బాజీ పనులు . అసలు శరత్ రాసే రాతలు రేపు నా బిడ్డ చూస్తే ఎలా తయారవుతాడో అని భయపడాల్సి వస్తుంది.

పై కామెంట్ లో నాతో బాటు సహాయ ని లాగారు అవసరమా . ...... అప్పుడు నేను మీకు లాగానే మొత్తుకున్నాను ఒక్కడు సపోర్ట్ రాలేదు.

2) ఆ అమ్మాయి ఒంగోలు శ్రీను బ్లాగులో శరత్ కి మద్దతు పలికింది . రేపు ఆవిడ అన్నో తమ్ముడో ఆవిడ మీద ఏమన్నా చేస్తే తెలుస్తుంది. అసలు ఆడ జన్మ ఎందుకు ఎత్తానా అనిపిస్తుంది.

అసలు శరత్ ఎం రాస్తాడో కూడా మాకు తెలీదు మొర్రో అంటున్నా వినకుండా ఈ రకంగా ఆడుకున్నారు . ఏకపక్షంగా .. అజ్ఞాత రూపం లో అప్పుడు మాకెవడూ సపోర్ట్ రాలేదే. అదే శరత్ తో ఇప్పుడు అందరూ బాగనే చంగలిచ్చుకుంటా తిరుగుతున్నారు.

నాకు నా ఫ్రెండ్ కి కష్టం వచ్చినప్పుడు ఎవరూ రాలేదు ... మరి మేము ఎందుకు రావాలండి ? యేవో బ్లాగుల్లో స్మైల్ ఇస్తున్నాము అన్నారు . ఇంకేం చేయమంటారు .
ఇక సురేఖా గారి కామెంట్ కి నా స్పందన టాపిక్ పక్కదారి పడుతుంది అని మాత్రమె . బ్లాగుల్లో మీ ఐడి లు వాడుకునే వారికి బైకుల్లో తిరిగే కుర్రాళ్ళకి ఎం సంబంధమో నాకు అర్ధం కాలేదు. ఇప్పటికీ అర్ధం కాలేదు .


చివరిగా మీరు భరద్వాజ్ కి ఇచ్చిన సమాధానం

భరద్వాజ్ గారు,

మీరు భలే చెప్తారండి.. స్రీనివాస్ ఏమో మీరెప్పుడూ మహిళా బ్లాగర్ల వైపే మాట్లాడతారు. పురుష బ్లాగర్లని కూడా వెకిలిగా రాస్తున్నారు కదా మరి అంటేనే నేను చివరి లైను కలిపాను.


నా కామెంట్ కి మీరు పోస్ట్ ఎడిట్ చేసి కొత్త లైన్ కలిపినప్పుడే నేను గెలిచాను .

to be continued ................................

32 comments:

శరత్ కాలమ్ said...

జిందాబాద్, శ్రీనివాస్ జిందాబాద్ :)
అవునూ నాదో సందేహం - మీరు అబ్బాయిలకు మాత్రమే ప్రతినిధా లేక హొల్ మొత్తం బ్లాగు మగవాళ్లకు కూడానా?

Any way, Zindabad war of genders!

నాగప్రసాద్ said...

శరత్ గారు, హోల్ మొత్తం మగ బ్లాగర్లకు అనుకోండి. :)).

మగ బ్లాగర్ల ప్రతినిధి వికటకవి శ్రీనివాస్ జిందాబాద్. :).

శరత్ కాలమ్ said...

@ నాగ
శ్రీనివాస్ పైకి ఇలా డాంబికాలు పలుకుతున్నాడు గానీ ఎప్పుడు తోక ముడుస్తాడో చెప్పలేం. మనవాడిని మన మొగాళ్ళు నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టవుతుందని నా సంశయం. కొంతకాలం క్రితం ప్రవీణ్ నాదెండ్ల నాలుగు అవతారలతో వచ్చి నాలుగు కామెంట్లు వేయగానే వణికిపోయి చెంపదెబ్బలు వేసుకున్నాడు. ఇప్పుడు మదపుటేనుగు ఘీంకారాలకి ఇంకా ఏం తట్టుకుంటాడూ :))

నాగప్రసాద్ said...

శరత్ గారు, ఓ పక్క నాదీ అదే అనుమానం. గదిలో పిల్లిని పెట్టి కొడితే సింహమవుతుందంట. అలానే శ్రీనివాస్ కూడా అయ్యాడేమో. కొన్నాళ్ళు పోతే తెలుస్తుంది కదా. :))).

Unknown said...

శ్రీనివాస్ బలహినులకి సపోర్ట్ అవసరం గాని
పొట్టేలును డి కొనడానికి ఒంగోలు గిత్తకి అవసరమా ?
అవతలి వాళ్ళు పోస్ట్ తీసేయ్యడమే నీ విజయానికి చిహ్నం .
ఇంతకీ మిగతాబాగం ఎప్పుడు?

ఏక లింగం said...

అటుదిరిగీ ఇటుదిరిగీ ఈ యవ్వారం ఏదో ఆడ/మగ బ్లాగర్ల మధ్య గొడవలా తయారయింది కదా. :)

రవిగారు అన్నట్లు, ఒంగోలు గిత్తలాంటి మీకు వేరొకరి సపోర్ట్ అవసరమా చెప్పండి.

శరత్ కాలమ్ said...

@ Ravi
"అవతలి వాళ్ళు పోస్ట్ తీసేయ్యడమే నీ విజయానికి చిహ్నం"

అంత దృశ్యం లేదు శ్రీనివాసుకి. ఆ పోస్టు మళ్ళీ పెట్టారు :))

Malakpet Rowdy said...

ఇక సురేఖా గారి కామెంట్ కి నా స్పందన టాపిక్ పక్కదారి పడుతుంది అని మాత్రమె . బ్లాగుల్లో మీ ఐడి లు వాడుకునే వారికి బైకుల్లో తిరిగే కుర్రాళ్ళకి ఎం సంబంధమో నాకు అర్ధం కాలేదు. ఇప్పటికీ అర్ధం కాలేదు ____________________________________

I agree with this 100%

I think Surekha over-reacted

శరత్ కాలమ్ said...

ఒంగోల్ శీను పిల్లా లేక పులా? నేడే తెరపై చూడండి!

ఏక లింగం said...

వార్నీ... ఇంతసేపూ సురేఖ, సురేఖ అంటే ఎవరో ఆడలేడీస్ అనుకున్నాను. తీరా చూస్తే మగమేల్...

కత పవన్ said...

సురేఖ అంటే అడలేడిస్ కాదు...మగా మహరాజే ..అయన ఏమి మాట్లాడాడొ అయినకే తేలిదు..ప్రవీణ్ కధ చదివి డైరక్ట్ గా అక్కడికి వచ్చినట్టు ఉన్నారు..

అవును ఇంతకి గోడవ ఏంది....

శరత్ కాలమ్ said...

హర్రే, అవును కదా. సురేఖ - ఆయనో వృద్ధ బ్లాగరు. అందుకే కుర్రాళ్ళంటే మంట వున్నట్లుంది. ఆయనగారి బ్లాగులో టీం మెంబర్ ఎవరో చూసారా :)

కత పవన్ said...

ఏది ఏలా ఉన్నా అడవాళ్ళు అనే పేరు రాగానే అక్కడి ఒక్క జివి ప్రత్యక్షం అవుతుంది ..చీబీ నావు అని చాలా రోజుల తరువాత చుస్తున్నాను మళ్ళీ అయనని.
అదేంటొ అడావారి గురించి ఒక్క ముక్క తేడాగా వచ్చిన మీద పడి కరిచేస్తారు జనాలు..ఇప్పుడు అదే జరుగుతుంది .శ్రీనివాస్ నువ్వు ఈ పొస్ట్ డిలిట్ చేయకుండా అడిగి కడగాలి అనుకుంటే కానివ్వు లేదు ఇంతకు ముందు లా దినిని డిలిట్ చేయలనుకుంటే ఇప్పుడే చేసేయ్ లేదంటే ఇక్కడికి వచ్చిన మేమంతా పిచ్చి డాశ్ లు అవుతాం

శరత్ కాలమ్ said...

సురేఖ అని ఆడపేరు పెట్టుకున్నంత మాత్రాన మగ జన్మ పుట్టి మగవాళ్లను, అందునా కుర్రవాళ్లను చులకనచేస్తూ వ్యాఖ్యానిస్తారా!? ఇది మనం సహించవద్దు. ఎంత వారి టీం మేటు ఆడవారు అయినంత మాత్రాన ఇంత పక్షపాతమా!! లీ'డర్' గారూ, వారిని వెంఠనే మగవాళ్ళ నుండి బహిష్కరించండి. అడవాళ్ళలో కలిపెయ్యండి. వెంటనే జెండర్ మార్చేయండి.

Anonymous said...

అందర్ కి బాత్ ఏంటంటే సురేఖ అన్న పేరు చూడ గానే
అలవాటు లో పోరా పాటు గా ప్రమదావనం లో సబ్యురాలు గా చేరి పో
అని పిలుపు రావడం తో వారు చేరి పోవడం , ఆ పైన వొంటే గుడారం కధ లాగా
వీరు టీం మెంబెర్ గా చేరి పోవడం జరిగి పోయింది .
ఎప్పటికన్నా మగ బ్లాగర్స్ అందరి కి కూడా టీం మెంబెర్ గా జేరడమే వారి తదుపరి లక్ష్యం .
మొదటి టార్గెట్ కాగడా తర్వాత భరద్వాజ్ . ఇంక కాస్కోండి .

కత పవన్ said...

అడేవడొ అకతాయి గాడు నా బ్లాగులొ జ్యొతి గారి ప్రోఫైల్ తో నన్ను తిడుతు రాసాడు అవిడా కాదని నాకు తేలుసు కాని ఇది ఏక్కడికో వేళ్ళీపోయింది

Anonymous said...

అయిన శరత్తూ ఆడైతే ఏంది మగైతే ఏంది? నీకెవరైనా భావం ముఖ్యం కదా. ఓ పాలి నువ్వే ఇదెక్కడో చెప్పినావ్ గందా!!

మిస్టర్ యక్ష said...

నేను కూడా పక్కనే ఉన్నా మిత్రమా, గళమెత్తి చెప్దాం పద!!

శరత్ కాలమ్ said...

@ Anonymous
ఆడయినా, మగయినా మనకు ఒక్కటే కానీ ఆడ ఆడేనని, మగ మగేననే క్లారిటీ కూడా మనకు అవసరం కదా. అలా క్లారిటీ లేక మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అవుతుంది కదా ;)

కామెంటుతో బాటు మనం ఏ కాంటెక్ష్టులో అన్నామన్నది కూడా ముఖ్యం బ్రదరూ. అప్పుడు అలా ఎందుకన్నానో ఏంటో.

Malakpet Rowdy said...

LOL నన్ను చేర్చుకునే ధైర్యం ప్రమదావనానికి ఉందా?

But I would like to nominate Kagada for the membership. It will be fun :))

Malakpet Rowdy said...

సురేఖ అంటే సు(బ్బారావు) రే(చర్ల) - from ఖ(రగ్ పూర్) అని నా అనుమానం :))

Malakpet Rowdy said...

వీళ్ళిలా ప్రవర్తించడానికి
వాళ్ళకి సరైన లోక జ్ణానం లేదు.మంచి పుస్తకాలు చదవరు.బైకు మీద తిరుగుతూ
ఆడపిల్లలను చూసి కేరింతలు కొట్టడమే తెలుసు.ఇలా తిరుగుతూ ఏదో ఒక రోజు
గోతుల్లో పడటం ఖాయం.స్త్రీ లంతా తమ బ్లాగుల ద్వారా ఇలాటి వాళ్ళకి జ్ణానోదయమ్
కలిగించాలి
_________________________________________________

చప్పట్లోయ్ చప్పట్లు!

శరత్ కాలమ్ said...

నా చప్పట్లు కూడా.

Anonymous said...

ee surekha evarandi babu, manchi team 'leader' laa unnaaru, valla team lo evarni ainaa ante kottettu unnaare ? surekha ni ela aina mee team lo cherchukondi sreenivas, godava vadilipoddi.
hahaha, agnaatha baaga cheppaaru.pidakala veta:
>>వొంటే గుడారం కధ , ee katha chepparoo?

Anonymous said...

I am with you Srinivas. I think you are right, go ahead. Don't mind some desperate old women(not lady) bloggers, they are obsessed with nude pictures on some old templess. ;)

Malakpet Rowdy said...

By the ay Sreenivas,

Why do u need somebody else's support? Can't you fight alone? Come on man, you are from the Rediff Chat room and you must be able to take 10 guys on at a time.

Anonymous said...

శ్రీనివాస్ గారు మళ్ళీ గొడవ పెట్టేసుకున్నారా!!!
చిన్న పిల్లాడిలా ఆ గొడవలేమిటి?నవ్వొస్తుందండి. నా బ్లాగ్ నా ఇష్టం చదువుతే చదువు లేకపోతె పో! నీ బోడి సలహా ఏమిటి? అంటారా? అరే మీరు అబ్బాయిలకి ప్రతినిధా ? నేను ఒప్పుకోను !!! సహాయ కి ప్రతినిధి గా మీరు !!!!
సహాయ విషయం లో ఎవరు ఏమన్నా అందరికి సమాధానం చెప్పుకోవలిసిన అవసరం మీకు లేదు. ఇలాంటి గొడవల్లొ తలదూర్చి మంచివారు కూడా చెడ్డవారు కాకండి.ఎందుకంటే మీ way గొడవ పెట్టుకోవటం కాదు. మీ most important way సహాయ . అమ్మాయిలనందరిని ఎడా పెడా తిట్టేయకండి .......PLZ...............


మీ అభిమాని
ఓ అమ్మాయి

Anonymous said...

ఈ క్రింది లింకులో చివరి రెండు కామెంట్లు చూడండి

https://www.blogger.com/comment.g?blogID=5045189757356582594&postID=999642765576446847

శ్రీనివాస్ ఒకరికి ఎదురు తిరగ్గానే శ్రీనివాస్ కి దక్కిన ఫలం

మంచు said...

" నేను చెప్పేది ఒకటే అన్యాయాలు జరిగినప్పుడు మహిళ పక్కన కాకుండా మనిషి పక్కన నిలబడండి "

ఈ స్టేట్మెంట్ చేబుతుంది నువ్వేంటో.. ఎందుకు అనవసరంగా చిన్న చిన్న వాటికి వివరణ ఇస్తావ్..

ఎవరెంత పెర్వర్ట్లొ ఇక్కడ అందరికీ తెలుసు శ్రీనివాస్.. ఆ పెర్వెర్ట్ చెలరేగిపొయినప్పుడు ఖండిచలేదంటే వాళ్ళు కుహానా మహిళావాదులు అయివుండొచ్చు.. లేక ఆ పిచ్చొడికి బయపడి వుండొచ్చు.. ఇదంతా మన సుత్తి మీద నుండి టాపిక్ డైవెర్ట్ చెయ్యడానికి .. లైట్ తీసుకో బ్రదర్ .

Malakpet Rowdy said...

ఎందుకంటే మీ way గొడవ పెట్టుకోవటం కాదు.
________________________________

Did you ever see him on the Rediff room? :))

Anonymous said...

@malak:
ఎందుకంటే మీ way గొడవ పెట్టుకోవటం కాదు.
________________________________

Did you ever see him on the Rediff room? :))

అంటే అర్థం ఏమిటి? sorry నాకు ఇంగ్లీష్ రాదు

Anonymous said...

late gaa, nenu ee blogs choosaanu.

http://vjyothi.wordpress.com/2007/11/03/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6-%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3/

http://nijamga-nijam.blogspot.com ( ramana's blog)