అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

4/11/09

బ్లాగరుల సృజనాత్మకత కి పరిక్ష

జనులార , హితులార , సన్నిహితులారా ,,,

మరేమో ఆల్రెడీ వికట కవి అనే పేరు తో ఒక బ్లాగు ఉన్నా సంగతి తెలీక నేను పేరెంచుకుంటిని ... మరి అదేమాదిరిగా ముందుకు పోతున్నాం... ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం , టపాలు రాసాం అన్న విషయాన్నీ మనవిచేస్కుంటున్నాను.

ఐతే ఈనాడు మరొక్క బ్లాగు ఉన్నదనీ ... ఇదే పేరు తో ఉన్నదని .. సీమ పచ్చగా ఉండాలంటే నేను పేరుమార్చాలని నిర్ణయించుకున్నా, రాజీవ్ బ్లాగు పేరు మార్పిడి పధకం కింద నా బ్లాగు పేరు మార్చే ప్రయత్నం చేస్తున్నా.

సామజిక న్యాయం కోసం కొత్త పేరు సూచించే అవకాశాన్ని మీకు ఇస్తున్నాను మొదటి సారిగా మా ప్రజా చోద్యం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టింది.

కొన్ని పేర్లు బ్లాగెలక్షన్ కమీషన్ సూచించడం జరిగింది

డాం
గన్నేరు పప్పు
జిల్లేడు పూలు
లేవండి పడుకోండి
బ్లాగు తమ్ముడు
పాకశాల
బుర్రలో మూట
తోచింది కూస్తాను
నాన్న బడి
ప్రపంచం లో అసాద్యం
మజా రాజ్యం
నూతన పెన్ను
నా నస వీణ
మూడార్లు
పన్నెండు

ఈ పేర్లలో ఒక మంచి పేరు సూచించిన వారికి రాజేష్ తో ఒకరోజు గడిపే అవకాశం. పేర్లే కాక మీకు తోచిన పేర్లు కూడా సూచించ వలసింది గా కోరడమైనది.

గమనిక : బ్లాగు పేరు మాత్రమే మార్చుతున్నాను .. బ్లాగ్ లో ప్రధాన పాత్ర ధారుడిని కాదు .... రాజేష్ పాత్ర ఎవరికిఇవ్వబడదు

27 comments:

జ్యోతి said...

హాస్య బ్రహ్మా(నందం)

VikaTaaTTahaasa kavi said...

naa nasa veena is good

చైతన్య said...

ఈ పేర్లన్నీ ఆల్రెడీ ఉన్న బ్లాగులకి పేరడి పేర్లని అర్థమైంది...
అలా ఎందుకు... ఒకరి బ్లాగు పేరుతో సంబంధం ఎందుకు... మీది మీకే... ఏదైనా వెరైటీగా ఆలోచించండి...

వేణూ శ్రీకాంత్ said...

హ హ మా క్రియేటివిటీ ఏమో కానీ నీ పేర్లు కేక సోదరా.. "ఒంగోలు గిత్త.." అనో "తస్సాదియ్యా.." అనో ఎలా ఉంటుందంటావ్ :) కానీ "మజారాజ్యం" బాగా సూటవుతుందేమో నీ బ్లాగ్ స్వభావానికి.

మాధవ్ said...

jilledupoolu bagundhi..mee theme ento chebthe kottaperu suggest cheyyochu!!

ధవళ సోమశేఖర్ - విజయనగరం said...

మజా రాజ్యం
నా నస వీణ

these are funny mahn ...

సూర్యుడు said...

"తోచింది కూస్తాను" కే నా వోటు

రవిగారు said...

pradhama vanam ,seenugaru, vummu,jagada,poyyekalam,aganidhara,sinivas yekkasekalu ,kuda parisilincha galaru

Malakpet Rowdy said...

ఇంకా ఉన్నాయి:

బడుధ్ధయిలు - గడుగ్గాయిలు
వాతలు -మేతలు
నీతులు - బూతులు
చెమ్మ-తడి
మార్తాండ - మామిడితాండ్ర
బోడి కప్పు
ఫల్గుణుడి స్నానాలు
ఒంగోలు సీను - చేబ్రోలు మీను


కొంచం ఘాతూగా ఉండే తిట్ల బ్లాగు అయితే

నీ యెంక్ ....
తాట వలుస్తా

మిగతావి:

భరత్ గోళం - ఇది పెద్దలకు మాత్రమే
చీ, ఫోండీ (రవిగారికి నచ్చే బ్లాగు)
కుళ్ళుబోతు భార్యలు - తిరుగుబోతు భర్తలు
హాం ఫట్ ( ఇది అబ్రచదబ్ర బ్లాఉగుకు పోటీ)

నేను రికమెండ్ చేసే బ్లాగు పేరు:

"అజ్ఞాత"

Anonymous said...

బైకు వీరుడు

శ్రీనివాస్ said...

@ జ్యోతి గారు పేరు బహు బాగున్నది

ధన్యవాదాలు వికతాట్టహాస కవి గారు

@ చైతన్య

మరేమో మంచి పేరు కోసం జరిపే అన్వేషణ లో అలా ఐపోయింది

@వేణూ శ్రీకాంత్ గారు
మీరు సోచించిన పేర్లు మా పరిశీలనా కేంద్రానికి పంపడమైనది :D

శ్రీనివాస్ said...

@మాధవ్ గారు

ప్రత్యేకమైన థీం అంటూ ఏం ఉండదు .. నాకు మోకాల్లో ఏం అన్పిస్తే అదేరాస్తా

@ధవళ సోమశేఖర్ - విజయనగరం గారు ధన్యవాదాలు

ధన్య వాదాలు సూర్యుడు గారు

శ్రీనివాస్ said...

ఆగని ధార ,యెకసెక్కాలు అదిరాయి రవి గారు

మలక్ అన్నయ మీరు చెపిన అని పేర్లతో బ్లాగులు తెరిచేద్దాం

అజ్ఞాత .. అది కూడా ఆలోచిద్దాం

Anonymous said...

నిఖార్సైన comedy
వాడిగా పదునుగా
గజిబిజి

చైతన్య said...

శ్రీ'నివాసం'

Anonymous said...

meegada

పరిమళం said...

"అల్లరి ఫిడుగు " నాకు మోకాల్లో ఇదే తట్టింది :) :)

నేస్తం said...

ha ha ha

గీతాచార్య said...

మోకాల్లో మహా ప్రపంచం. ఎలా ఉంది సీనురాజేష్ గారు?

సుజాత said...

Geetaacharya,ha ha ha!
Superb!

Sujata said...

I vote for sl.no.1.

Sujata said...

I vote for sl.no.1.

Vinay Chakravarthi.Gogineni said...

enti boss pelli kudrinda.............oka post raayi pelli choopula anubhavaalu...............
ide name vunchinanta maatra problem emiti...........no prob.............

హరే కృష్ణ . said...

vikatakavi bavundi kada antha sudden ga ee decision enti

mee remix names keka

చైతన్య said...

పోస్ట్లు ఎందుకు చేస్తున్నట్టు... ఎందుకు డిలీట్ చేస్తున్నట్టు!

భాస్కర్ రామరాజు said...

రిమ్మురాజు
స్పోక్ రాజు
నన్ హెచ్ ఐదు, యాడ ఆగమాక
గ్రేట్ బ్లాగర్ ఒంగోల్

swapna@kalalaprapancham said...

అయ్యో నేను ఇపుడే చూసాను ఈ పోస్ట్. సరేలే నా creativity use చేసి రెండు పేర్లు రాసాను.
రాజేష్ - మహా గడుగ్గాయి
రాజేష్ - మంచి బాలుడు
(అనుకుంటే పొరబాటే :))
ఇంకా change చేయనట్టు ఉన్నావు మీ బ్లాగ్ పేరు.