అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

6/17/10

దయ్యం అంటే ఇష్టం

నాకు చిన్నప్పటి నుండి దయ్యాల సినిమాలు అంటే చాలా ఇష్టం, సినిమాలే కాదండోయి దయ్యాన్ని చూడాలనే ఉద్దేశంతో మా ఒంగోలు లోని మామిడి పాలెం స్మశానానికి రాత్రి వేళల్లో వెళ్లి ఆ సమయం లో అక్కడికి వచ్చే విటుల( రవిగారికి సంభందం లేదు ) ఏకాంతానికి భంగం కలిగించే వాడిని. కానీ నా కోరిక తీరలేదు . అలాగే దయ్యాన్ని చూడాలనే నా ఆశ చావలేదు. నేను పదవ తరగతి లో ఉండగా .... రైలు కట్ట దగ్గర అదీ రాం నగర్ పదవ లైన్ దగ్గర రాత్రి వేళల్లో దయ్యాలు సంచరిస్తున్నాయి అన్న సమాచారం నాలో ఉత్సాహాన్ని నింపింది. నా ఫ్రెండ్ శేషు కూడా దయ్యాన్ని చూడాలని ఉత్సాహ పడ్డాడు. ఇద్దరం కలిసి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. రాత్రి ఎనిమిది అవగానే నేను శేషు వాళ్ళ ఇంటిలో చదువుకుంటా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళా... వాడు అన్నం తింటూ మద్య మద్య లో ఏదో రాసుకుంటున్నాడు. ఏంట్రా అంటే దయ్యం కనిపిస్తే కోరాల్సిన కోరికల చిట్టా అంట ( దయ్యాలు కోరికలు తీరుస్తాయి అని వాడికి చిన్నప్పుడు ఎవరో చెప్పారులే) సరే మా ఇంట్లో చదువుకుని అక్కడే పడుకుంటాం అని వాళ్ళ ఇంట్లో చెప్పి వెళ్ళాం. రాం నగర్ కి పది లైన్స్ ఉంటాయి ప్రతి లైన్ రైల్వేయ్ ట్రాక్ దగ్గర ఎండ్ అవుతుంది. ఒకటో లైన్ దగ్గర ట్రాక్ ఎక్కాం. పదవ లైన్ సమీపిస్తున్న కొద్ది మాలో విపరీతమైన యాంగ్జయిటీ మొదలైంది.

కానీ అక్కడ దయ్యాలు కాదు కదా ఆ సూచనలు కూడా లేవ్. సరే ఇంకొంచం ముందుకి వెళదాం అనుకుంటుండగా సడన్ గా ట్రాక్ పక్క నుండి ఒక శాల్తీ వచ్చి నా చెయ్యి పట్టుకుంది . ఒక్క సారి గుండె జల్లు మంది .. "అరె శేషుగా శేషుగా" అని అరుస్తూ పక్కకి చూద్దును కద వాడు అప్పటికే అరట కిలో మీటర్ పరిగెత్తాడు. ఈ లోపు నా చెయ్యి పట్టుకున శాల్తీ ఒక ఆడమనిషి అని అర్ధం అయింది. నాకు నోట్లో నుండి మాట పెగలడం లేదు. " ఎందబ్బాయి నిన్న గాక మొన్న పాంటు వేసినట్టు ఉన్నావ్ అప్పుడే తొందర వచ్చిందా ? రెండువందలు అవ్వుద్ది తీయి బయటికి " అదోకలాంటి యాసలో అడుగుతున్నా ఆ మనిషిని చూసి "దయ్యానికి డబ్బులేందుకు" అన్నా అంతే " సచ్చినోడ దయ్యం నన్ను దయ్యం అంటావా రేయ్ సుబ్బిగా ఈడేవడో చూడరా " అని అరిచింది. సదరు సుబ్బిగాడు కర్ర తీసుకుని చెట్ల సందు లో నుండి రావడం చూసి పిటి ఉష పెంపుడు కొడుకు లా పరిగెత్తి ఇల్లు చేరుకున్నా !

మర్నాడు శేషుగాడు అడిగాడు రాత్రి ఎం జరిగింది అని జస్ట్ కొద్ది రోజుల ముందే భైరవ ద్వీపం సినిమా చూసి ఉండడంతో నరుడా ఓ నరుడా ఏమి కోరిక సాంగ్ రేంజి లో వాడికి ఒక దయ్యం కన్య కహానీ వినిపించి ఆ దయ్యం కన్య నా అందానికి మెచ్చి ఒక వరం ఇచ్చింది అని... ఆ వర ప్రభావం వల్ల నేను తల్చుకుంటే ఎవడినైనా శపించి మసి చేయగలను అని చెప్పి ... రాజేష్, శేషు, విక్టర్, సీనుగాడు ( పాములోడు) జ్యోతి, రాజి, నందిని, మోహన మొదలైన మిత్ర బృందాన్ని నా పాదాక్రాంతుల్ని చేసుకున్నా . కొన్నాళ్ళకి "దయ్యం పేరుతో జనాన్ని బెదరగొట్టి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరస్ట్" అన్నవార్త మా వాళ్ళు చూడ లేదు కనుక నా ఆటలు మరి కొన్నాళ్ళు సాగాయి. కానీ దయ్యాన్ని చూడాలన్న నా కోరిక తీరలేదు ... హారర్ సినిమాలు చూస్తూ ఆ కోరిక తీర్చుకుంటున్నా .. మీరెవరన్నా మంచి దయ్యం సినిమాలు పరిచయం చేసి పుణ్యం కట్టుకోండి ప్లీచ్ ........... హారర్ సినిమాల మోజులో హాలీవుడ్ లో వై.వి.ఎస్. చౌదరి, తేజ కన్నా వికారం ఉన దర్శకులు తీసిన వికారపు సినిమాలకి బలి అవుతున్నా..

15 comments:

వెంకట్ said...

http://www.imdb.com/title/tt0084787/

Software Tykoon said...

సూపరు :)
మరి మన బ్లాగ్లోకం ఎవరు అయినా అటువంటి కథలతో సినిమా తిస్తారేమో కదా !!! నాకు తెలిసి...

Anonymous said...

వికటకవీ నిజం చెప్పు ఆ రోజు పారిపోయి వచ్చావా లేక ఆ వేశ్య తో గడిపి వచ్చావా ??

శ్రీనివాస్ said...

@ అజ్ఞాత నీ నోట్లో మన్నుబడ

శ్రీనివాస్ said...

@ నాకు హారర్ లో కూడా దయ్యాల హారర్ కావాలి

శ్రీనివాస్ said...

@ వెంకట్ పై కామెంట్ మీకే

Anonymous said...

నాకు హారర్ లో కూడా దయ్యాల హారర్ కావాలి thean watch
Grudge2

శ్రీనివాస్ said...

thanks anonymous

శ్రీనివాస్ said...

ఈ grudge ని స్కేరీ మూవీ నాలుగవ పార్ట్ లో పేరడీ చేశారు. లొల్

శివ చెరువు said...

Post baabundi..mee buddi kukka supergaa..undi..

Anonymous said...

కింద పెట్టిన ఫోటో లో ఎవరు క్యూట్?

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

LOL..బావుంది మీ అడ్వెంచర్

శ్రీనివాస్ said...

నన్ను grudge చూడమని చెప్పిన అజ్ఞాత మరొక్కసారి థాంక్స్

Nrahamthulla said...

బౌద్ధం తప్ప మిగతా అన్ని మతాలలోను దయ్యాలున్నాయనుకుంటా.
క్రైస్తవమతంలో దయ్యాలుః
* బైబిల్ లో వీటిని అపవిత్రాత్మలు అంటారు.సాతానును లూసిఫర్,అపవాది లాంటిపేర్లతో కూడా పిలుస్తారు.
* సేన అనే దయ్యాలగుంపు పట్టిన వాడిని ఏసు బాగుచేస్తే ఆ దయ్యాలు వెళ్ళి పందులలో ప్రవేశిస్తే ఆ పందులు సరస్సులో పడి చనిపోతాయి (లూకా 8:33)
* ఏసు దయ్యాల అధిపతివలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని పరిసయ్యులు ఆరోపిస్తారు(మత్తయి 9:34).
* దయ్యాలుకూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతాయి (యాకోబు 2:19)

ఇస్లాం మతంలో దయ్యాలుః

* హసన్ హుసేన్ లకు చెడుదృష్టి తగలకుండా దయ్యాలబారిన పడకుండా ప్రవక్త ప్రార్దించేవారు.
* షైతాను రెండుకొమ్ముల మధ్యలో నుంచి సూర్యుడు ఉదయిస్తాడు(బుఖారీ 4:494)
* నమాజు చేసేవాని ముందునుంచి నడిచేవాడు దయ్యంలాంటివాడు(బుఖారీ 4:495)
* రాత్రికాగానే పిల్లల్ని దగ్గరకుతీసుకోండి.దయ్యాలు తిరుగుతుంటాయి (బుఖారీ 4:500)
* దయ్యాలు పరలోకం నుండి భవిష్యవిషయాలను ఒకటో రెండో దొంగతనంగా విని జోతిష్కులకు చెబితే వాళ్ళు వంద అబద్దాలు వాటికి కలిపి చెబుతారు(బుఖారీ 6:324)

మనోహర్ చెనికల said...

వాసిరెడ్డి సీతాదేవిగ ారి మరో దయ్యం కధ చదవండి. బాగూంటుంది. teluguone.com లో దొరకచ్చు.