అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/31/09

సర్దార్జీ క్షమించు

ఇందాకే ఒక మిత్రుడు సిక్కుల గురించి ఉన్న దాదాపు అన్ని జోకులు మెయిల్ చేసాడు ... కాసేపయ్యాక ఆకాశమంతా .... సినిమా రివ్యూ చదవడం జరిగింది ... అందులో కూడా సర్దార్ మీద వచ్చే జోకుల గురించి ప్రస్తావనఉంది.
సర్దార్ జోక్స్ ఇవాళ ఇంతలా ఫేమస్ అవడానికి కారణాలేంటి .... అసలు సర్దార్ జోకులెలా పుట్టాయి అని కాస్త లోతుగా కొద్దో గొప్పో నాకు పరిచయం ఉన్నా సర్కిల్ లో ఆర తీయగా కొన్ని విషయాలు తెలిసాయి.
స్వతంత్ర పోరాటం లో తెల్ల వాడికి చెమటలు పట్టించటం లో సర్దార్జీల పాత్ర చాలా ఉందని అసలు స్వాతంత్రం కోసంప్రాణాలు ఒడ్డి పోరాడిన యోధులు వారి లోనే ఎక్కువని .. వారు చూపిన తెగువను తట్టుకోలేని తెల్లవాడు అక్కసు తోవారి వారి పార్టీలలో సర్దార్జీ జోకులు మొదలెట్టాడని .. తెల్సుకున్న తర్వాత .. నా మీద నాకే కోపమొచ్చిందికొన్నాళ్ళు సర్దార్జీ జోకులు నేను ఆస్వాదిన్చినదుకు. తెల్లవాడు మన వారి మీద మొదలెట్టిన దాడి ని మనమేకొనసాగిస్తున్నాం.
సర్దార్జీల మీద ఈనాడు ఇన్ని జోకులా. గూగుల్ సెర్చ్ లో సర్దార్ అని కొడితే కొన్ని వందల వెబ్సైట్లు .. దర్సనమిస్తున్నాయి .. ఒక్క సారి ఆలోచిస్తే సామజిక వర్గం లోని వారు యెంత ఆత్మన్యూనతా భావానికీలోనవుతారు .. పాఠశాల లో కళాశాల లో సాటి పిల్లల అవహేళన మద్య పిల్లల మానసిక పరిస్తితి .. నిజం గామనకే అలాంటి పరిస్థితి వస్తే ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది .... ... గాడ్ .... నిజం గా ప్రపంచం మొత్తం కలిసి ఒక జాతి మీద జరుపుతున్న హేయమైన దాడిగా అనిపించింది. నా సామాజిక వర్గాన్ని ఎత్తి చూపుతూ మీ వాళ్ళకికాస్ట్ ఫీలింగు ఎక్కువ రో అని నన్ను స్కూల్ లో కాలేజి లో కొందరు మాట్లాడుతుంటేనే నాకు చాలా బాదేసేది. అలాంటిది ప్రపంచమంతా ఇంత దారుణమైన ప్రక్రియ జరుగుతుంటే వారెంత బాధ పడుతున్నారో.

మీరెప్పుడైనా సర్దార్జీ ని కలిసారా .. కలిస్తే గమనించండి యెంత మంచి వారో .... యెంత దేశభక్తి కల వారో తెలుస్తుంది.. పెళ్ళాం పిల్లల్ని వదిలి దేశం మొత్తం లారీ డ్రైవర్లు గా , హైవే పక్కన ధాభాలు నడుపు కుంటూ మనకెంతో సేవ చేస్తున్నారు ... తన మీద తనే జోకు వేసుకునే మంచి వాడు సర్దార్జీ ... అలాంటి సర్దార్జీని బాద పెడితే మనకి పాపం.
పైగా కొన్ని జోకుల్లో వారి స్త్రీల కారెక్టర్ గురించి చెండాలమైన కామెంట్స్ ఉన్నాయి. ఇదెంత కుసంస్కారం.
నవ్వు కోవాలి కాని అది కొందరి పాలిట శాపం గా మారకూడదు.
గమనిక : నేను తెలుగు బ్లాగ్లోకం లోకి కొత్తగా వచ్చాను .. చర్చ ఇంతకు ముందు కూడా జరిగి ఉండవచ్చు .. మళ్ళా జరిగితే తప్పులేదుగా.
(ఈ సారి సర్దార్ జోకులు ఎవరికన్నా చెప్పేటప్పుడు సర్దార్ పేరు తీసేసి తన పేరు పెట్టుకోమని రాజేష్ ఉచిత సలహా ఇస్తున్నాడు)

15 comments:

Anonymous said...

100% agree with you pal. They are the real helpers when things matter. Absolutely good people. Even when the entire friendship circle dumps you, they will always stand by you and help. Also they are the hardest workers, and never beg. In the entire Delhi city you will not find a single sardar begging. They will always work very hard and have the best self respect in the country.

ASHOK said...

NENU KOODA INTHAKU MUNDU SARDARJI JOKES ENJOY CHESANU..KAANI OKA NIJAM TELUSUNNAKA MAANESAANU(SARDAR JI LU KASTINCHI PANICHESTHAARU KAANI EKKADA BEGGING CHEYYARU)

Unknown said...

బాగా చెప్పారు. నేను సర్దార్జీ జోకులు చదవడం మానేసాను చాలా రోజుల క్రితమే....
నిజానికి వాళ్ళు ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా తీసుకుంటారు కానీ లేకపోతే "జాతిని కించపరుస్తున్నందుకు ఎన్ని కోర్టులు కావాలి ?"

వెంకట రమణ said...

http://prasadm.wordpress.com/2007/02/19/%E0%B0%B8%E0%B0%B0%E0%B0%A6%E0%B0%BE-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/

ఇది చూడండి. నా అనుభవం కూడా ఇలాంటిదే.

karthik said...

below is a related post:
http://avee-ivee.blogspot.com/2007/11/blog-post.html

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
సుజాత వేల్పూరి said...

అవును, ఆకాశమంత సినిమాలో సర్దార్జీలపై గౌరవాన్ని పెంచే విధంగా ఒక పాత్ర చేత డైలాగ్ చెప్పించడం నాక్కూడా నచ్చింది. సర్దార్జీ జోకులు చదివినపుడు అందులోని కంటెంట్ కి నవ్వుకోడం తప్పించి వ్యక్తి గతంగా వారినుద్దేశించి నవ్వుకోడం నాకూ నచ్చదు. మంచి పోస్టు.
ఇందాక రాసిన వ్యాఖ్యలో అచ్చుతప్పులు పడ్డాయి. అందుకే డిలీట్ చేశాను.

ఉమాశంకర్ said...

చాలా మంచి విషయం చెప్పారు. నిజానికి నేను చాలా సార్లు ఆలోచించాను ఈ జోకుల ప్రహాసనాన్ని మొదలెట్టిన ప్రబుద్దులెవరయి ఉంటారా అని. ఏకమొత్తంగా ఒక జాతి మీదే కించపరుస్తూ జోకులేసుకోవటం దారుణం

bphanibabu said...

భారతదేశం లో తమ మీద జోకులు వేసికొని ఆనందించేవారిలో సర్దార్జీలు మొట్టమొదటి వారు. అంత విశాలమైన మనస్సు కలవారు

అరుదు.


ఫణిబాబు

అశోక్ చౌదరి said...

మంచి పాయింట్ చెప్పారు, ఆలోచింప చేసే టప .. Thx

చిలమకూరు విజయమోహన్ said...

భారతదేశంలో అధికంగా శ్రమించేవాళ్ళెవరయ్యా అంటే ముందుగా చెప్పాలంటే సిక్కు సోదరసోదరీమణులే.అలాంటివారిని చెత్తజోకులువేసి అవమానించేవారు పనికిమాలినవాళ్ళు,సోమరిపోతులేనని నాఅభిప్రాయం.

నేస్తం said...

చాలా చక్కని ఆలోచింపజేసే పోస్ట్ వేసారు.. ఇన్నాళ్ళూ సర్దార్జీలపై వేసే జోక్స్ విని నవ్వడమే గాని ఇంత ఆలోచించలేకపోయాను

mounavi said...

baga chepparu

సోదరి said...

ఇప్పటికి మీ చదివిన పోస్ట్లు అన్నీ మరొక సారి చదివేసాను :) ఏదండీ కొత్త పోస్టు

chaitanya said...

hmm