అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

10/7/13

సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగుల చూపెటు ??

ఉద్యమాల వ్యవహారం పక్కన పెడితే ఏ పార్టీ తో కలిసి ఉండాలనే అంశం లో ప్రభత్వ ఉద్యోగులు కొంత డైలమా లో ఉన్న మాట వాస్తవం. రాష్రం లో ప్రభుత్వాలను మార్చగల శక్తి ఉన్న వర్గాలలో ఉద్యోగులుకూడా  ఒకరు . అయితే 2004లో  తెలుగుదేశం పార్టీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ కి తమ మద్దతు తెలిపారు ఉద్యోగులు.
 ప్రస్తుతం కాంగ్రస్ పార్టీ కి  సీమంద్ర లో ఉద్యోగులకు మద్య  చిచ్చు రగిలింది . మరి ఇటువంటి పరిస్థితులలో రానున్న  ఎన్నికలలో  వారి ముందున్న ప్రత్యామ్నాయలు రెండు ....ఒకరు చంద్రబాబు రెండు  జగన్ బాబు .

చంద్రబాబు పేరు చెబితేనే  ఉద్యోగుల కోపం కట్టలు తెంచుకుంటుంది .  చండశాసనుడు,  రాక్షసుడు , పని పని అని సావగొడతాడు , ఆకస్మిక తనిఖీల పెరుతో వేధిస్తాడు  పైగా   ఆయన తింటాడు మనల్ని కరక్టుగా ఉండమంటాడు ఇవి ప్రధానంగా ఉద్యోగులు ఆయనపై  చేసే విమర్శలు.

ఇక  జగన్ బాబు విషయం లో వారికున్న భయాలు మామూలు భయాలు కావు . కేవలం మూడేళ్ళు ఎంపి గా  చేసినందుకే ఎంతో మంది ఐపిఎస్ లు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు . ఇక ఒక టర్మ్ సిఎం గా  చేస్తే ఖచ్చితంగా సామూహిక జైలుజీవితం గడిపేలా చేస్తాడేమో అన్న భయాలు వాళ్ళకి లేకపోలేదు .  మెడ  మీద కత్తి పెట్టి పనులు చేయించుకుని ఆనక  ఐఎఎస్ శ్రీలక్ష్మి ని చేసినట్టు చేస్తాడేమో అని భయపడి చస్తున్నారు . మరి ప్రస్తుతం  వారి దారెటు ?చచ్చి చెడి కాంగ్రెస్ తోనే అంటకాగడమా ???  రాక్షసుడో చందా శాసనుడో చంద్రబాబు కి మద్దతు ఇవ్వడమా లేక జాలు పాలైనా జగన్ పక్కన చేరి  డబ్బులు  దండుకోవడమా??