అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

4/29/13

ఎటు వైపు మన పయనం

కట్ట  బియ్యం  675 రూపాయలు పెట్టి కొని ఆరు నెలలు అవలేదు అప్పుడే 1100 కి చేరుకుంది . ఒక నెలకి ఇంటిల్లిపాది కొనుక్కు తాగే  నీళ్ళ ఖర్చు దాదాపు 800 . ఈ ధరలు కేవలం  సామాన్యుడి నడ్డి మాత్రమె విరుస్తున్నాయి అనుకుంటే పొరబాటు . భవతీ బిక్షాందేహీ  అన్న  అరుపు  సిటీలలో  వినిపించడం లేదేమో గానీ చిన్న చిన్న  పట్టణాలలో  పల్లెల్లో ఇంకా  వినిపిస్తూనే ఉంది . ఆ  అరుపు  వినగానే ఇంట్లో నుండి  ఒక చిన్న గ్లాసులో బియ్యం తెచ్చి వేసే  ఇల్లాళ్ళు కనుమరుగయ్యారిప్పుడు .. అందరి చేతులు ఖాళీ లేవిప్పుడు.  దారిన పోయే  బాటసారికి గుక్కెడు  నీళ్ళు ఇచ్చే  పరిస్థితులు  లేకుండా  పోతున్నాయి. పొరబాటున చుట్టాలొస్తే   వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో   ఆ ప్రభావం నెల బడ్జెట్ మీద ఏ రకమైన  ప్రభావం చూపిస్తుందో  అన్న టెన్షన్  మద్య తరగతి  జీవికి నిద్రపట్టనీయదు. ఇదే  కొనసాగితే ? 

ఒకప్పుడు  అత్యంత గౌరవంగా  బతికిన  చిన్న చిన్న రైతులు ఇప్పుడు  మా  ఊర్లో గుడి  కడుతున్నాము చందాలు  ఇవ్వండి  అని  దేవుడి పేరు చెప్పుకుని  పరాయి  జిల్లాలలో అడుక్కు తినాల్సిన  పరిస్థితి . అమ్మాయిని గవర్నమెంటు స్కూలుకి పంపి  అబ్బాయిని మాత్రం    మంచి కాన్వెంట్ లో  చదివించుకునే  అభిప్రాయానికి చాలా  మంది మళ్ళీ వచ్చేసారు .

 కేవలం  నిత్యవసరాలకోసం మధ్యతరగతి పోరాటం చేయాల్సిన రోజులు  కళ్ళ ముందే  కనిపిస్తున్నాయి. సినిమాల్లాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా కొన్ని కుటుంబాలు దూరం చేస్కోవాల్సిన  పరిస్థితులు  ఇప్పటికే వచ్చేసాయి. బతకడం కోసం కొన్ని వందల మంది సకుటుంబ సపరివార  సమేతంగా దాడులకి తెగబడే రోజులు   ముందు ముందు  చూస్తామేమో  అనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఉందా?  ధరలు తగ్గించాలా లేక  జనాల్లో కొనుగోలు శక్తి పెంచాలా ?  దళారీ  వ్యవస్థ  నాశనం చేయాలా  లేక ప్రజా  స్వామ్యం  స్థానే మరో కొత్త  వ్యవస్థ సృష్టించాలా????

6 comments:

జలతారు వెన్నెల said...

సరైన నాయకులను ఎన్నుకోవడం ఒకింత పరిష్కారం అనుకోవచ్చేమో?

రాజ్ కుమార్ said...

హ్మ్మ్... నేను నవ్వుకుందామని వస్తే... ఆలోచనలో మునిగిపోయి భయపడే పోస్టేశావు సీనన్నా..

ఏమో.....;(

రహ్మానుద్దీన్ షేక్ said...

ఒక తక్షణ ఉపాయం, సమిష్టి వ్యవస్యామే. తక్కువ లాభాలతో రైతులు సమిష్టిగా పంటలు పండించాలి. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఇంట్లో పెరడు మళ్ళీ పెట్టుకోవడం ప్రారంభించాలి. ఆ పెరటి ఆలనా-పాలనా కూడా సమిష్టిగా చేస్తే చాలా మంచిది. లాభదాయకం.

Anonymous said...

Electing good politicians is the only way. Many people living in india do not realize how the hell their lives are. As long as people keep supporting dirty politics, there is no end to this.

As I see india from outside, it has failed in most aspects. People don't respect people, birds, animals, trees, rivers, sea. At this point, I don't see even one step closer to better country. Country is going backwards unless people realize it and take measures on urgent basis.

బుల్లబ్బాయ్ said...

బాబూ షేకు, ఇక్కడ గోల మీకర్థమైనట్టు లేదు.

సమిష్టి వ్యవసాయం మీద, పెరట్లో వ్యవసాయం ఎకరేజ్ మీద 500% వ్యాటు, కరువు పన్ను, వరద పన్ను, దానిమీద ఎడ్యుకేషన్ సెస్సు, మన్ను మశానం సెస్సు వేసి మిమ్మల్ని మల్లీ రోడ్డుమీదకి తెస్తారు..

ఇయ్యాళ పేపరు చదవలా? వస్త్ర వ్యాపరులు మూట కట్టి ముట్టచెప్పిన తర్వాత వ్యాటు నిర్ణయం బయటకొచ్చింది. ఇహ చూస్కో మనకి పాంటు కోనే రేటుకు పొట్టి లాగూలు కూడ దొరకవ్!

శ్రీనివాస్ said...

సరియైన నాయకులు ఉంటె ఎన్నుకొందుము ఎంచక్కా వారు లేకనే కదా వెన్నెల గారు ఈ గొడవంతా

రేపట్నించి నవ్వుకుందాం లే రాజన్