తెలంగాణా రాష్ట్రం కోసం మొదట ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి తల్లి , తన కుమారుని చావుకి కారణం తెరాస నేతలే అని గొంతెత్తి సంచలనానికి తెరతీసారు. ఈ రోజు తెలంగాణా రాష్ట్రం కోసం అసువులు బాసిన వారి కుటుంబసభ్యులు తమని ఆదుకుంటాం అని చెప్పిన తెరాస తమకు చెల్లని చెక్కులు ఇచ్చిందంటూ తెలంగాణా భవన దగ్గరికి వస్తే వీరంతా ముష్టి వచ్చారు అని తెరాస నాయకులు మీడియా ముందు చెప్పడం తెలంగాణా ప్రజలు నిర్ఘాంతపోయేలా చేసింది. ఈ మాటలు అన్న తెరాస నేత సుమన్ మొన్నటిదాకా ఓయు జెఎసి నేతగా ఉన్నాడు. ఓయు లొ మరణించిన విద్యార్ధుల తల్లి దండ్రులను పట్టుకుని డబ్బులకి కక్కుర్తిపడ్డ వారిగా సుమన్ వాఖ్యానించడం గమనార్హం.
మొన్నటి ఎన్నికలలో తెలంగాణా అమరవీరుల త్యాగాలు ఫలించాలి అంటూ వారి ఫోటోలు పెట్టుకు తిరిగిన తెరాస ఇప్పుడు వారిని హీనంగా చూడడం ఉద్యమకారులకు ఒక కనువిప్పు కావాలి. ఓయు నేతలుగా ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలకు ఉపఎన్నికల టిక్కట్టు ఇవ్వాలి అని నిందించిన నాయకులు తెరాస నాయకులు అవ్వగానే అదే అమరవీరుల కుటుంబాలను స్వార్దపరులుగా మీడియా ముఖంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ... అది నాయకుల అసలు రంగు బయటపెట్టింది.
ఇకనైనా విద్యార్ధులు మేల్కొని తమ భవిష్యత్తు ఇలాంటి స్వార్ధపరుల చేతిలొ పెట్టకుండా ... ఉద్యమాల పేరుతో తమ జీవితాలు నాశనం చేసుకోకుండా ... తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని కోరుకుందాం.

16 comments:
బాధ పడాల్సిన విషయం ఇది
నీ మాటలు ఎలా నమ్మాలి.. ? ఇదంతా అబద్దం అనిపిస్తొంది
Donga checks iche ilanti party Telangana ni uddaristhadhanta ! Money kosam ila kakkurthi paduthunna ee sannasulu Martyr's anta !!! Idemi Udyamam , Idemi golara naayana ??? even though i oppose it ...i feel ashamed even to oppose such agitation . Yaaaakkk thooo!!!!!!
Shava raajakeeyalu ani vinatemey ippativaraku . Ippudu choostunnam. Paapam TRS bhavan ki heavy police protection pettalsi vachindi. Telangana kosam Telangana lo vunna party ki police protection pettalsi raavatam chaala duradrustakaram.
KCR nee tala yaada pettukuntav ?????????????????????
TRS bhavanla intha godava jaruguthunte RAJ news lo scrolling kooda raledu .... enduku chepmaaaa?
Raj TV లొ Scrolling రాలేదు కనుకనే పైనున్న కృష్ణ కి తెలీలేదు. వేరే ఛానల్ చూడవయ్య కృష్ణయ్యా
మీ మొఖాలు..
నేను అనేది సుమన్ అలా అనలేదని... వాళ్ళు తె భవన్ దగ్గర వచ్చి వాళ్ళే వొప్పుకున్నారు చెక్ లు అమరవీరుల ఐక్య వెదిక కి ఇచ్చారని.. ఆ తరువాత ఐక్య వెదిక ఇచ్చిన చెక్ లు చెల్లలెదు.. మద్య లో ఉన్న రఘు అనే వ్యక్తి తనకి ఐదు లక్షలు ఖర్చు ఐంది అని మాట చెప్పాడు.. ఇంకా అర్థం కాలెదా ?
ఇలా పైసలకి కక్కుర్తి పడే మొఖాల వల్ల నే సమస్య అంతా.. మీ లాంటి తిక్క గాళ్ళు దాని మధ్యల కొన్ని అబద్దాలతో ఆట మొదలు పెడతారు...
ఓసోస్.. అట్ట కోపం సేయ్యబాకు కృష్ణ , మీ నాయకుడు పవిత్రుడే .. కానీ మరణించినవారే అపవిత్రులు ఒప్పెస్కున్నాం హిహిహి
హహ్హాహ్హా .. మొదలు పెట్టారా మీ రాజకీయం.. బయటి మోసగాళ్ళని తరమాలి..ఇంటి దొంగ ని పాతాలి ..
మీరే చూద్దురు లెండి.. ఈ సమస్య లో ఎంత వరకు నిజం ఉందో.. చనిపోయింది నిజం... మద్యలో వచ్చిన దళారులు అమరవీరుల కుటుంబాలతో రాజకీయం చేస్తున్నారు...
ఎక్కడైనా ఒక చోట దొరక్కపోతారా అని చూస్తున్నారు మీ లాంటి వాళ్ళు.. గోతి కాడి నక్కాల్లాగా.. మీకు చాన్స్ ఇచ్చేది లేదులే..
బహుశా నీవన్న మధ్య దళారి సిమంధ్రా వాడు అయి ఉంటాడులే అన్నాయ్ అని ఒక స్టేట్మెంటు ఇస్తే పోలా! అప్పుడే కదా సన్నాసులు నమ్మేది.
ఛఛ మీదంత చీప్ రాజకీయం కాదుకదండి.. మాలో అమాయకులను మభ్య పెట్టి మా లో మాకే చిచ్చు పెడతారు కానీ.. అలా ప్రత్యక్షంగా ముందుకు రారు... పోతే వాళ్ళల్లో వాళ్ళే పోతారు .. మాకు ఢోకా ఉండదు... దళారి అయినా ఇంకెవరైనా ముందుకు మా వాళ్ళన్ని తోస్తరు.. మీరు ఎనకాల ఉంటరు...
బాబు కృష్ణా ,
ఈ లింక్ చదివి రా నాయనా
http://telugu.greatandhra.com/cinema/6-08-2010/17c_08_sum.php
ఇంకా కావాలంటే ఆ చానల్ ని అడిగి ఆ వీడియో కూడ తెస్తా
@రక్త చరిత్ర: >>Money kosam ila kakkurthi paduthunna ee sannasulu Martyr's anta !!!<<
చనిపోయినొళ్లు డబ్బుకొసం కక్కుర్తి పడ్డారని మీకెలా తెలుసును సార్!!
గ్రేట్ ఆంధ్రా లో ఉన్నదాన్ని నమ్మమంటావా ?..
ఆ విడియో పెట్టు.. తర్వాత రాతలు వ్రాయి ..
don't worry I found it..
http://www.youtube.com/watch?v=rNXegCO5TMA&feature=player_embedded
haha funny scene
You can find it here
http://www.ntvtelugu.com/category_topvideos.php
అక్కడ సుమన్ చెప్ప్తున్నాడు కదా.. రఘుమా రెడ్డి చీటర్ అని... ఇంకా కొట్టక కావలిచ్చుకున్టాడా ?
మీకు కొట్టుడే కనిపిస్తుంది .. వాడు ఆ కుటుంబాలకి చేసిన ద్రోహం కనిపించదు ..
అక్కడ మీది రాజకీయం .. మాది మోసపోయిన వైనం..
కిష్నన్నా, గిప్పుడు నేన్ "కిష్న దగాకోరు" అని ఓసారి అరిచేసి, నిన్ను దంచొంచ్చంటావ్?
తప్పకుండా .. మనం కొట్టుకుందాం ... నిజం, ధర్మం తెలిసిన వాడు ఎక్కువ సేపు నిలబడ గలడు .. నువ్వు బయటి నుండి చూస్తూ సమస్య పై రాల్లెస్తున్నావ్ .. మేము బాధ పడుతున్న వాళ్ళం ..
నీదెం పోతది ..
అందరు నీలా ఉండరు కదా దొంగ వికటకవి
Post a Comment