అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

10/13/10

సంస్కృతి ని ద్వంసం యెలా చేస్తారండి మీరు మరీను

"ఎవడో వచ్చి మన సంస్కృతి ని ద్వంసం యెలా చేస్తారండి మీరు మరీను " అంటూ మొన్నామధ్య చాలా కోపంగా అడిగాదొక పెద్ద మనిషి .... ఎం చేస్తాం జనాల అమాయకత్వం ఆ రేంజ్ లొ ఉంటే. ఎలా ద్వంసం అవుతుందో ఒక చిన్న ఉదాహరణ తీస్కుందాం. లాస్ట్ ఇయర్ ఆసియా దేశాలు ప్రధానంగా ఇండియా , చైనా విషయం లొ గూగుల్ వాడు చూపించిన పక్షపాతం ఒకసారి చూద్దాం


అమెరికన్ వెర్షన్ అయిన www.google.com లొ removing అని టైప్ చేస్తే ఇలా వచ్చింది.



మరి అదే ఇండియన్ వెర్షన్ www.google.co.in లొ అదే పదం ట్రై చేస్తే



అవాక్కయ్యారు కదా ....మరదే. ఆ మద్య ప్రతి స్కూల్ లోను ఆరవ తరగతి నుండి ఏదో ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం .. అది నెట్ నుండి డౌన్ లోడ్ చెయ్యమని పిల్లలని ఆదేశించడం జరిగినప్పుడు .... మన పిల్లలు గూగుల్ ని ఆశ్రయించడం .... దాంట్లో ఏది కొట్టినా బూతు రిలేటెడ్ సైట్స్ రావడంతో కొందరు అవాక్కైతే ... మరి కొందరు అతుక్కుపోయారు. చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఇంకా గుర్తించలేదు. మన పిల్లలు ... అవి చూసుకుంటూ బూతుకి ఎడిక్ట్ అవ్వాలి ... మరి వాళ్ళ పిల్లలు ఏమో విజ్ఞాన వంతులు కావాలా???

మొదట ఈ విషయాన్ని గుర్తించిన చైనా తమ దేశం లొ గూగుల్, యు గొట్టం నిషేదించగానే గూగుల్ మహాశయునికి జ్ఞానోదయం కలిగి ... ఇపుడు తన సెర్చ్ ఇంజన్ లొ బూతు సంబంధ వ్యవహారాలూ ఆసియా వెర్షన్ లొ కూడా ఆటో మాటిక్ దొర్లకుండా చూసుకుంటున్నాడు.

ఈ రోజుల్లో సంస్కృతి నాశనం చేయడం పెద్ద విషయం ఎం కాదు. బహుళజాతి సంస్థలు తల్చుకోవాలే గానీ.

18 comments:

snkr said...
This comment has been removed by the author.
karthik said...

i think partiality is a understatement.. My respect for google has reduced by leaps..

-Karthik

సవ్వడి said...

My god...
you are right...
MNCs talucukunte emainaa ceyyagalavu.

తుంటరి said...

తప్పు పూర్తిగా గూగులోడిది కాదేమొ. ఆ ప్రాంతం లో వచ్చిన ఎక్కువ హిట్స్ బట్టి పేజ్ రేంక్ చేస్తుంది.ఆ పేజ్ రేంక్ లో ముందు వచ్చినవి ఇవి.

Krishna said...

అవును ఆయా ప్రదేశాల్లో ఉపయోగించే వారి ఇష్టాలని బట్టి ఆ విధం గా ఎక్కువగా సర్చ్ చేయబడిన పదాలని చూపిస్తుంది.. అంతే.. అది వారి తప్పు కాదు.. అయినా మీరు అనే సంస్కృతి విధ్వంసం .. ఏదో ఒకటి ఆశ పెట్టి జరుపుతారు కాని.. ఇలా దొంగ పనులు అంత ప్రయోజనం ఇవ్వవు..

Anonymous said...

@ కృష్ణ & తుంటరి

యెంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. అది పూర్తిగా తప్పు . గూగుల్ మ్యాప్స్ విషయం లోనే కాష్మీర్ ని అరుణాచల్ ప్రదేశ్ ని ఒక్కో దేశం లొ ఒక్కోలా చూపిస్తాడు గూగుల్ వాడు దీనికి ఏమి చేబుతారు. అత్యధికంగా సెక్స్ కోసం సెర్చ్ చేయడం లొ అమెరికన్స్ టాప్ అయితే వారి సెర్చ్ ఇంజన్ లొ అవేమీ రాలేదే ? అసలు ఒక్క ముక్క కూడా రాలేదే?

కెక్యూబ్ said...

తప్పక ఎదుర్కోవాల్సిన విషయమే. ఇంత లేట్ గా తెలిసినందుకు ఇప్పటికే అనేక మంది పిల్లల బుఱలు చెడిపొయుంటాయి. ఆ క్లాసుల టీచర్లు కూడా పట్టించుకోకపోవడం ఘోరం.. మంచి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. థాంక్స్.

తుంటరి said...

@Anonymous అది కూడా అంతే. మన దేశం లో మనం అరుణాచల్ ప్రదేశ్ మనది అనుకుంటున్నాం చైనా కాదంటోంది అందుకే గూగులోడు ఇక్కడ ఒకలాగ అక్కడ ఒకలాగ చూపించాడు.

సెక్సు గురించి అమెరికాలో ఎక్కువ వెదుకుతారు అని మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? భారతీయులు సెక్సు అన్న పదాన్ని ఎక్కువ వెదుకుతారని ఎప్పుడో నేను ఈనాడు లో చదివినట్టు గుర్తు.

Anonymous said...

తుంటరి గారు మీరు చెప్పేది హాస్యాస్పదంగా ఉంది. భారతీయ విభాగంలో 99శాతం అశ్లీల సైట్స్ చూపించిన గూగుల్ అమెరికన్ విభాగంలో కనీసం ఒక లైన్ కూడా చూపించక పోవడం గమనార్హం. దీని వెనుక సాంకేతిక కారణాల కంటె నాకు కుట్ర కోణమే ఎక్కువ కనిపిస్తుంది.

తుంటరి said...

అందులో కుట్ర ఏమీ ఉండకపోవచ్చులెండి. అమెరికా వాళ్ళంతగా అంతర్జాలం వినియొగం మనకీ పెరిగితే మన గూగులు లో కూడా మంచివి వస్తాయి. మీరు కావాలంటే మీరు సెట్టింగ్స్ మార్చుకుని strict filtering ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

Anonymous said...

మన వాళ్ళు ఎక్కువగా ఏది వెతికారో అవ్వేవస్తున్నాయి. అది గూగుల్ తప్పు కాదు, మన తప్పు.

శ్రీకాంత్ said...

నేను అదే పదం (removing) టైప్ చేసాను. అశ్లీలంగా ఏమీ రాలేదే. ఇంతకు ముందు అలా జరిగేదేమో? ఇట్లాంటి ఘోరం కూడా కోరి చేస్తారనుకోను.
http://srikanthkakara.blogspot.com

Malakpet Rowdy said...

Americans don't use the terms like removing shirts or pants for adult content. They use terms like porn, adult games etc. It's usually, though not everytime, the Indians who fantasize cloth removal- nothing right or nothing wrong-it's just the difference in the adult culture lolz

By the way when I tried google.co.in on my phone it showed me

Removal of blackheads
Removal of dark circles
Removal of oil from Pizza
Removal of passwords from PDF

Malakpet Rowdy said...

Oops it's removing not removal

శ్రీనివాస్ said...

పై ఇమేజస్ నేను ప్రింట్ స్క్రీన్ తీసి ఒక సంవత్సరం అయింది. ఇప్పుడు గూగుల్ వాడు సెర్చ్ లొ అస్లీలత దొర్లకుండా చూసుకున్తున్నాడు ఏ దేశమైనా :)

Malakpet Rowdy said...

Hmm so that was the screenshot before you got married. Now I know what sites you were browsing those days

Hehehehehe :)))))))

snkr said...

ఏడాది కిందటి స్క్రీన్ షాట్ ఇప్పుడు వేయడమా!!! వెరిఫై చేయకుండా గుడ్డిగా పెట్టిన నా కామెంట్ వెనక్కు తీసుకుంటున్నాను. :)

snkr said...

ఏడాది కిందటి స్క్రీన్ షాట్ ఇప్పుడు వేయడమా!!! వెరిఫై చేయకుండా గుడ్డిగా పెట్టిన నా కామెంట్ వెనక్కు తీసుకుంటున్నాను. :)